Gurukul Admissions: ఐదోతరగతి ప్రవేశాల ప్రకటన జారీ చేస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ నెలన్నరపాటు సాగుతుందని, ఫిబ్రవరి 23న రాతపరీక్ష నిర్వహించి జూన్ 12లోగా ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
ముందుగా ఐదోతరగతి ప్రవేశాల ప్రకటన జారీ చేస్తామన్నారు. దరఖాస్తు ప్రక్రియ నెలన్నరపాటు సాగుతుందని, ఫిబ్రవరి 23న రాతపరీక్ష నిర్వహించి జూన్ 12లోగా ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు.
గురుకుల సొసైటీ కార్యక్రమాలపై డిసెంబర్ 6న సొసైటీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. 2025-26 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు అర్హత పరీక్ష నిర్వహించడం లేదని, పదోతరగతి పాసైన విద్యార్థులకు నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామన్నారు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ)ల్లో ప్రవేశాలకు మాత్రం అత్యధిక మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. గురుకులాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రత్యేకంగా మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని ఆమె వెల్లడించారు. కొందరు ఉద్దేశపూర్వకంగా గురుకులాలపై ఆరోపణలు చేస్తున్నారని, వారు మెరుగైన వసతుల కల్పనకు సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
గురుకులాల్లోకి ఇతరుల అనుమతి ఉండదని, విద్యార్థులు, ముఖ్యంగా బాలికలు ఉన్న చోట్ల మరింత కట్టదిట్టమైన భద్రత ఉంటుందని ఆమె వెల్లడించారు.
Apply:
Location: H no 7-1-7/1, Near Bus Stop,Main Road, Panagal, Nalgonda Dist, Pincode 508001, Telangana
Comments
Post a Comment