Apprentice Notification 2024: 1,500 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 31.
Apprentice Notification 2024: 1,500 అప్రెంటీస్ ఖాళీలకు నోటిఫికేషన్.. రాత పరీక్షలో ప్రతిభ చూపితే..
ఇటీవల కాలంలో ప్రాక్టికల్ స్కిల్స్ ఉంటేనే బ్యాంకులు నియామకాల్లో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ నోటిఫికేషన్ చక్కటి అవకాశంగా చెప్పొచ్చు.
అప్రెంటీస్ అనగానే ఐటీఐ, డిప్లొమా తదితర కోర్సుల విద్యార్థులకు పరిశ్రమల్లో ప్రాక్టికల్ శిక్షణ గుర్తుకొస్తుంది. కాని ఇటీవల కాలంలో అన్ని విభాగాల్లో అప్రెంటిస్ ఆవశ్యకత పెరుగుతోంది. దీంతో ఆయా రంగాల్లో అప్రెంటిస్ శిక్షణ ద్వారా విద్యార్థులకు క్షేత్ర నైపుణ్యాలు అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి.
మొత్తం ఖాళీలు 1,500
ఇండియన్ బ్యాంక్ దేశవ్యాప్తంగా 1,500 అప్రెంటీస్ ట్రైనీ నియామకాలకు ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 82, తెలంగాణలో 42 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు
జూలై 1, 2024 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. 2020, మార్చి 31 తర్వాత డిగ్రీ ఉత్తీర్ణత పొందిన వారు మాత్రమే అర్హులు.
జూలై 1, 2024 నాటికి 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ వర్గాలకు అయిదేళ్లు, ఓబీసీ (నాన్-క్రీమీ లేయర్) వర్గాలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లబిస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి అప్రెంటీస్ ట్రైనింగ్ చేసి ఉండకూడదు.
రాత పరీక్షలో ప్రతిభ
ఇండియన్ బ్యాంక్.. అప్రెంటీస్ ట్రైనీ ఎంపిక ప్రక్రియలో భాగంగా రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు. రాష్ట్రాల వారీగా, కేటగిరీల వారీగా మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. ఇందుకోసం అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ప్రాథమ్యంగా పేర్కొన్న రాష్ట్రం, కేటగిరీలను పరిగణనలోకి తీసుకుంటారు. అవసరమైతే ఇంటర్వ్యూ కూడా నిర్వహించే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఇంటర్వ్యూకు సైతం సన్నద్ధత పొందాలని నిపుణులు సూచిస్తున్నారు.
రాత పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నాలుగు విభాగాల్లో 100 మార్కులకు ఉంటుంది. ఇందులో రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ (25 ప్రశ్నలు-25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్ (25 ప్రశ్నలు-25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు-25 మార్కులు), జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు-25 మార్కులు)లపై ప్రశ్నలు అడుగుతారు. ఇలా ఒక్కో విభాగం నుంచి 25 ప్రశ్నలు చొప్పున మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం ఒక గంట. జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలకు ప్రాంతీయ భాషల్లో కూడా పరీక్ష నిర్వహిస్తారు. నెగెటివ్ మార్కింగ్ నిబంధన ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కును తగ్గిస్తారు.
స్థానిక భాష పరీక్ష
ఎంపిక ప్రక్రియలో భాగంగా లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ (స్థానిక భాష పరీక్ష)ను నిర్వహిస్తారు. ఆన్‌లైన్ రాత పరీక్ష తర్వాత దశలో ఇది ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి చెందిన భాషలో ప్రావీణ్యాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఈ పరీక్ష నిర్వహిస్తారు. 8, 10 లేదా 12 తరగతుల్లో సంబంధిత స్థానిక భాషను ఒక సబ్జెక్ట్‌గా చదువుకున్న వారికి స్థానిక భాష పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తారు.
రాత పరీక్ష, స్థానిక భాష పరీక్షలో ఉత్తీర్ణత సాధించి తుది విజేతల జాబితాలో నిలిచిన వారికి అప్రెంటీస్ ట్రైనీలుగా నియామకం ఖరారు చేస్తారు. ఈ అభ్యర్థులకు బ్యాంకు శాఖల్లో ఏడాది పాటు శిక్షణిస్తారు. ఈ సమయంలో మెట్రో/అర్బన్ బ్రాంచ్‌లలో నియమితులైన వారికి నెలకు రూ.15 వేలు; గ్రామీణ/సెమీ అర్బన్ బ్రాంచ్‌లలో నియమితులైన వారికి నెలకు రూ.12 వేల చొప్పున స్టయిఫండ్ చెల్లిస్తారు.
అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్
ఏడాది వ్యవధిలోని అప్రెంటీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక.. సదరు అభ్యర్థులకు ఇండియన్ బ్యాంకు, బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్ స్కిల్ కౌన్సిల్‌లు సంయుక్తంగా అసెస్‌మెంట్ టెస్ట్ నిర్వహిస్తాయి. ఇందులో థియరీ, ప్రాక్టికల్ మూల్యాంకన ఉంటుంది. థియరీ పరీక్షను బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్ స్కిల్ కౌన్సిల్, ప్రాక్టికల్ అసెస్‌మెంట్‌ను ఇండియన్ బ్యాంకు నిర్వహిస్తాయి. ఈ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇండియన్ బ్యాంక్-బీఎఫ్‌ఎస్‌ఐ సెక్టార్ స్కిల్ కౌన్సిల్ ద్వారా అప్రెంటీస్‌షిప్ సర్టిఫికెట్ అందిస్తారు. ఈ సర్టిఫికెట్ చేతిలో ఉంటే భవిష్యత్తులో బ్యాంకింగ్ రంగంలో కొలువుల సాధనలో ముందంజలో నిలిచే ఆస్కారం ఉంటుంది.
ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ ట్రైనీ నియామకాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ముందుగా నేషనల్ అప్రెంటీస్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌లో తమ ప్రొఫైల్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగానే (రిజస్ట్రేషన్ నెంబర్) ఇండియన్ బ్యాంకు నోటిఫికేషన్‌కు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా దరఖాస్తు సమయంలో అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న రాష్ట్రంలోని మూడు జిల్లాలను తమ ప్రాథమ్యాలుగా పేర్కొనే వెసులుబాటు కల్పించారు.
➤ దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
➤ ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 2024, జూలై 31.
➤ ఆన్‌లైన్ రాత పరీక్ష: ఆగస్ట్‌లో నిర్వహించే అవకాశం.
➤ పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.indianbank.in/career
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
రాత పరీక్షలో రాణించేలా
ఇంగ్లిష్ లాంగ్వేజ్
బేసిక్ గ్రామర్‌పై అవగాహన పెంచుకోవాలి. ముఖ్యంగా ఇడియమ్స్, టెన్సెస్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటన్స్ రీ అరేంజ్‌మెంట్, వన్‌వర్డ్ సబ్‌స్టిట్యూట్స్, యాక్టివ్-ప్యాసివ్ వాయిస్‌లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఈ విభాగంలో రాణించేందుకు అంకగణిత అంశాలపై పట్టు సాధించాలి. శాతాలు, నిష్పత్తులు, కాలం-దూరం,కాలం-పని,నంబర్ సిరీస్‌లను అవపోసన పట్టాలి. అదే విధంగా కోడింగ్-డీ కోడింగ్,సీటింగ్ అరేంజ్‌మెంట్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్స్, సిలాజిజమ్స్‌పై అవగాహన పెంచుకోవాలి. విశ్లేషణ సామర్థ్యం, తార్కిక దృక్పథం పెంచుకోవాలి.
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్
ఇందులో జామెట్రీపై అవగాహన కలిసొస్తుంది. అదే విధంగా పై చార్ట్స్, ఫ్లో చార్ట్స్‌ను విశ్లేషించడం, డేటా ఆధారంగా సమాచారాన్ని విశదీకరించడం ప్రాక్టీస్ చేయాలి. అదే విధంగా.. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి.
ఈ విభాగంలో ఆర్థిక రంగ పరిణామాలకు ప్రాధాన్యమివ్వాలి. సామాజిక సమకాలీన పరిణామాలతోపాటు, బ్యాంకింగ్ రంగంలో ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలను అనుసరిస్తూ వాటిపై పట్టు సాధించాలి.
కంప్యూటర్ నాలెడ్జ్
బేసిక్ కంప్యూటర్ ఆపరేటింగ్ స్కిల్స్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్, కీ-బోర్డ్ షాట్ కట్ కమాండ్స్‌పై నాలెడ్జ్ పరీక్ష సమయంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రిపరేషన్‌లో భాగంగా అభ్యర్థులు రీడింగ్‌తోపాటు ప్రాక్టీస్‌కు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. తద్వారా టైం మేనేజ్‌మెంట్‌పై అవగాహన వస్తుంది. అదేవిధంగా వీక్లీ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపకరిస్తుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ గురించి నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు పదో తరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్ పుస్తకాలను పరిశీలిస్తే సులభంగా రాణించగలరు.
Comments
Post a Comment