SSC Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల
SSC Recruitment 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ నోటిఫికేషన్ విడుదల.. అర్హత ఇతర వివరాలు తెలుసుకోండి..
SSC Stenographer Recruitment Notification 2024: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ,డీ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈరోజు జూలై 26 శుక్రవారం ఈ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సీ, డీ విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ చివరి తేదీ ఆగస్టు 24. ఈ రిక్రూట్మెంట్‌లో ఎన్నికైనవారిని వివిధ మంత్రిత్వ/డిపార్ట్‌మెంట్/ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు పొందవచ్చు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీయేట్ పూర్తి చేసి ఉండాలి. వారి వయస్సు 18-30 మధ్య ఉండాలి. గ్రేడ్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18-27 మధ్య ఉండాలి.
పరీక్ష తేదీ..
అభ్యర్థలకు రెండు దశల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ముందుగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆ తర్వాత స్కిల్ టెస్ట్ (Ditation, Transcription) నిర్వహిస్తారు. ఈ ఆన్‌లైన ఎగ్జామ్ అక్టోబర్‌లో నిర్వహిస్తారు. ఈ నోటిఫికేషన్‌లో ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారనేది త్వరలో వెల్లడించనున్నారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్ష జాతీయ స్థాయిలో నిర్వహిస్తారు. అధికారిక వెబ్‌సైట్ ssc.gov.in ద్వారా నేరుగా అప్లై చేసుకోవచ్చు.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ అవేర్‌నెస్ కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఇక నైపుణ్య పరీక్షలో టైపింగ్ స్పీడ్, స్టెనోగ్రాఫీకి సంబంధించింది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ెఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకుని మీ వివరాలను నమోదు చేయాలి. పర్సనల్ వివరాలు, ఎడ్యుకేషన్, ఇతర డాక్యుమెంట్లతోపాు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment