Telangana LAWCET Counselling 2024 : తెలంగాణ లాసెట్ 2024 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో న్యాయ విద్య సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. తెలంగాణ లాసెట్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది
Telangana LAWCET Counselling 2024 : తెలంగాణ లాసెట్ ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ ప్రక్రియ ఆగస్టు 5 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది.

Telangana LAWCET Counseling 2024 : తెలంగాణ లాసెట్ 2024 అభ్యర్థులకు గుడ్‌న్యూస్. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ లా కాలేజీల్లో న్యాయ విద్య సీట్ల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 20వ తేదీతో ముగియనుంది. రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు మాత్రం రూ. 500 చెల్లించాల్సి ఉంటుంది. ఇక.. ఆగస్టు 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఆగస్టు 23వ తేదీతో వెబ్ ఆప్షన్ల గడువు ముగుస్తుంది. ఆగస్టు 24వ తేదీన వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. ఆగస్టు 27వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 28వ తేదీ నుంచి 30వ తేదీలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో https://lawcet.tsche.ac.in/ ఈ ప్రాసెస్‌ను పూర్తి చేసుకోవచ్చు. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలు త్వరలోనే ఖరారు కానున్నాయి.2024-2025 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) TS LAWCET/ TS PGLCET 2024 పరీక్షను నిర్వహించింది. ఈ ఏడాదికి సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఈ ఏడాది జరిగిన తెలంగాణ లాసెట్ 2024 పరీక్షకు 40,268 మంది హాజరయ్యారు. వీరిలో 29,258 మంది అర్హత సాధించారు. మొత్తంగా 72.66 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు.
TS LAWCET Counselling 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ :

తెలంగాణ లాసెట్ కౌన్సెలింగ్
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, హెచ్ నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
TS PGECET 2024 Counselling : తెలంగాణ పీజీఈసెట్ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎంఈ, ఎంటెక్, ఎం.ఆర్క్, ఎంఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి జులై 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://pgecetadm.tsche.ac.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.TS PGECET Counselling 2024 షెడ్యూల్ :
- టీజీ పీజీఈసెట్ నోటిఫికేషన్ వెల్లడి: 20.07.2024
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్: 30.07.2024 - 09.08.2024
- స్పెషల్ కేటగిరీ (ఎన్‌సీసీ/క్యాప్/పీహెచ్/స్పోర్ట్స్) సర్టిఫికేట్ వెరిఫికేషన్: 01.08.2024 - 03.08.2024
- అర్హులైన అభ్యర్థుల జాబితా వెల్లడి: 10.08.2024
- వెబ్‌ఆప్షన్ల నమోదు: 12.08.2024, 13.08.2024
- వెబ్‌ఆప్షన్ల సవరణ: 14.08.2024
- తొలివిడత సీట్ల కేటాయింపు: 17.08.2024
- సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్: 18.08.2024 - 21.08.2024
- తరగతుల ప్రారంభం: 31.08.2024
Comments
Post a Comment