కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నది, దరఖాస్తులకు చివరి తేదీ: 23-08-2024

చిన్న జాబ్ అయినా సరే గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకునే వారే ఎక్కువ. ప్రైవేట్ సెక్టార్ లో లక్షల ప్యాకేజీలతో ఉద్యోగావకాశాలు ఉన్నా సెక్యూరిటీ ఉండదు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ.. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కాంట్రాక్ట్ పద్దతిలో భర్తీ చేయనున్నది. ఈ ఉద్యోగాలకు పోటీపడే వారు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ /బీటెక్ (కంప్యూటర్ సైన్స్ /ఐటీ / సైబర్ సెక్యూరిటీ / కంప్యూటర్ నెట్‌వర్కింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు. ఈ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆగస్టు 23 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ముఖ్యమైన సమాచారం :
- ప్రాజెక్ట్ ఇంజినీర్-1 పోస్టులు : 11
అర్హత:
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 55 శాతం మార్కులతో బీఈ /బీటెక్ (కంప్యూటర్ సైన్స్ /ఐటీ / సైబర్ సెక్యూరిటీ / కంప్యూటర్ నెట్‌వర్కింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
- అభ్యర్థుల వయసు 32 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
- రాత పరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
జీతం:
- నెలకు రూ.40,000- రూ.55,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:
- జనరల్ రూ.472, ఎస్సీ /ఎస్టీ /పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తులకు చివరి తేదీ:
- 23-08-2024
Comments
Post a Comment