TG LAWCET 2024: అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ లాసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం, అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.
TG LAWCET 2024 : అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ లాసెట్ కౌన్సిలింగ్ ప్రారంభం..
లాసెట్ అభ్యర్థులకు అలర్ట్.. తెలంగాణ లాసెట్ 2024 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆగస్టు 20వ తేదీ వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా అధికారులు కోరారు.
రాష్ట్రంలోని న్యాయ కళాశాల్లో ప్రవేశాల కోసం లాసెట్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. 2024-2025 విద్యా సంవత్సరానికి గాను లా కాలేజీల్లో మూడేళ్లు, ఐదేళ్ల లా కోర్సుల్లో ప్రవేశాలకు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో TS LAWCET/ TS PGLCET-2024 నిర్వహించారు. జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్ష జరిగింది. మూడు సెషన్లలో పరీక్షలు జరిగాయి.
మొదటి సెషన్ ఉదయం 9 నుంచి 10.30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 12.30 నుంచి 2 గంటల వరకు, మూడో సెషన్ సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు జరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. లాసెట్ పరీక్షకు మొత్తం 40,268 మంది హాజరయ్యారు. ఈ పరీక్షలో మొత్తం 29,258 (72.66 శాతం) మంది అర్హత సాధించారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను చెక్ చేసుకునేందుకు నేరుగా అధికారిక https://lawcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ను సంప్రదించగలరు.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
లాసెట్ 2024 సీట్ల కేటాయింపు..
ఇక, ఈ పరీక్షకు సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఈ నెల 20వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు రూ. 800 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్సీ, దివ్యాంగ అభ్యర్థులు అయితే రూ. 500 చెల్లించాలి.
ఈ నెల (ఆగస్టు) 22వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ఎంచుకునే ప్రక్రియ ఉంటుంది. ఈ నెల 23వ తేదీతో ఈ గడువు కాస్త పూర్తి అవుతుంది. వెబ్ అప్షన్లను ఎడిట్ చేసుకునేందుకు ఆగస్టు 24వ తేదీన అవకాశం ఇస్తారు. ఈ నెల (ఆగస్టు) 27న లాసెట్ 2024 సీట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 28వ తేది నుంచి 30 తేదీల మధ్యలో ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మొదటి విడత కౌన్సిలింగ్ అనంతరం రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తారు.
Comments
Post a Comment