TS ICET Counselling 2024 : ADMISSION INTO MBA MCA COLLEGES :: 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్, ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు - సెప్టెంబర్ 1 నుంచి 8వరకు
ADMISSION INTO MBA MCA COLLEGES :: 2024
TS ICET 2024 Counselling: విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. సెప్టెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి. వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
Pay Processing Fee
Processing Fee to be Paid
Processing Fee: Rs.1200/- (OC/BC), Rs.600/-(SC/ST) can be paid by the candidate using credit card or debit card or through net banking till 08-09-2024 only.
TS ICET Counselling 2024 : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ సీట్ల భర్తీకి సంబంధించి సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ (ICET Counselling 2024) నిర్వహించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఐసెట్ ప్రవేశాల కమిటీ సమావేశం నిర్వహించారు. విద్యామండలి, ప్రవేశాల కమిటీ ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఎ.శ్రీదేవసేన, విద్యామండలి ఉపాధ్యక్షుడు ఎస్‌కే మహమూద్, ఐసెట్ కన్వీనర్ ఆచార్య నరసింహాచారి, క్యాంపు అధికారి బి.శ్రీనివాస్, ఇతర సభ్యులు సమావేశమై రెండు విడతల కౌన్సెలింగ్ షెడ్యూళ్లను ఖరారు చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబరు 1 నుంచి 17వ తేదీ వరకు తొలి విడత, 20 నుంచి 28వ తేదీ వరకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఈ నెల 27వ తేదీన పూర్తిస్థాయి అడ్మిషన్ నోటిఫికేషన్, మార్గదర్శకాలను వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నారు.షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 4వ తేదీ నుంచి నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 14న తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈసారి రెండు విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సెప్టెంబరు 1 ప్రారంభమై.. 17వ తేదీతో ముగియనుంది. ఇక సెప్టెంబర్ 20వ తేదీతో సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమై.. సెప్టెంబర్ 28వ తేదీతో ముగుస్తుంది. ఆగస్టు 27వ తేదీన పూర్తిస్థాయి కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారిక వెబ్‌సైట్ https://icet.tsche.ac.in/ లో ఉంచనున్నారు.
జూన్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 71,647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే.. 64 ఎంసీఏ కాలేజీల్లో 6990 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
TG ICET 2024 Counselling ముఖ్యమైన తేదీలు :
జూన్ 5, 6 తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని 116 కేంద్రాల్లో ఐసెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించిన తెలంగాణ ఐసెట్ పరీక్ష కోసం 86,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 77942 మంది అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్ష రాసిన వారిలో 71,647 మంది ఉత్తీర్ణులు కాగా.. ఉత్తీర్ణత శాతం 91.92 శాతంగా నమోదైంది. ఇక తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 272 ఎంబీఏ కాలేజీల్లో 35,949 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే.. 64 ఎంసీఏ కాలేజీల్లో 6990 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
TG ICET 2024 Counselling ముఖ్యమైన తేదీలు :
- కౌన్సెలింగ్ ప్రారంభం - సెప్టెంబర్ 1,2024
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు - సెప్టెంబర్ 1 నుంచి 8వరకు.. ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 9వ తేదీతో ఈ గడువు ముగుస్తుంది.
- సెప్టెంబర్ 4 నుంచి 11వరకు వెబ్‌ఆప్షన్లను ఎంచుకోవాలి.
- సెప్టెంబర్ 14వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
Comments
Post a Comment