Tech Mahindra : టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు..

 

Tech Mahindra : టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు.. మీ అర్హతలు, అనుభవాన్ని బట్టి చెక్‌ చేసుకోండి.. లింక్‌ ఇదే



IT Hiring : ప్రముఖ దేశీయ సంస్థ టెక్‌ మహీంద్రా హైదరాబాద్‌లో పనిచేయడానికి సంబంధించి సీనియర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. వివరాల్లోకెళ్తే..

ప్రధానాంశాలు:

  • టెక్‌ మహీంద్రా రిక్రూట్‌మెంట్‌ 2024
  • సీనియర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ పోస్టుల భర్తీ
  • జాబ్‌ లొకేషన్‌ హైదరాబాద్‌
Tech Mahindra
టెక్ మహీంద్రా

Tech Mahindra : హైదరాబాద్‌లోని టెక్ మహీంద్రా కంపెనీ.. సీనియర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండి 2 నుంచి 6 ఏళ్లు అనుభవం ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు టెక్‌ మహీంద్రా ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

ఇతర ముఖ్య సమాచారం :

  • పోస్టు: సీనియర్‌ సెక్యూరిటీ అనలిస్ట్‌
  • కంపెనీ: టెక్ మహీంద్రా
  • అనుభవం: 3 నుంచి 6 ఏళ్లు ఉండాలి.
  • అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉన్న వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు.
  • నైపుణ్యాలు: అష్యూర్‌ క్లౌడ్‌ బేసిక్‌-1 నైపుణ్యాలు ఉండాలి.
  • జాబ్ లొకేషన్: హైదరాబాద్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

AI Skills : ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఏఐ స్కిల్స్‌లో మెరుగైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యం

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌-ఏఐ విభాగంలో తెలంగాణ ప్రత్యేక హబ్‌గా ఆవిర్భవించి ప్రపంచానికే ఆదర్శంగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల్లోనూ ఏఐని సమర్థంగా వినియోగించుకోవాలనే బృహత్తర లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుల మార్గనిర్దేశంలో దీనికి సంబంధించిన స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, ఏఐని విస్తృతంగా అమలు చేయడానికి 25 కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.

అందులో భాగంగానే ఈనెల 5, 6 తేదీల్లో ఏఐ అంతర్జాతీయ సదస్సును ప్రభుత్వం నిర్వహిస్తోందని, ఈ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి ఏఐపై రోడ్‌మ్యాప్‌ను ప్రకటిస్తారని తెలియజేశారు. వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించిన నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకూ సుమారు 2000 మంది హాజరు కావడానికి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. పలు కంపెనీలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటుందని జయేశ్‌ రంజన్‌ వివరించారు.


అయితే.. ఏఐపై ఆసక్తి ఉన్నవారికి.. ముఖ్యంగా ఇంజినీరింగ్‌ విద్యార్థులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలనేది ప్రభుత్వ లక్ష్యం. అత్యధికులకు ఏఐపై శిక్షణ ఇస్తేనే.. ఇందులో కొందరికి కొత్త ఆల్గరిథమ్స్‌ను తయారు చేయడంపై ఆసక్తి ఏర్పడుతుంది. అందుకే ఏఐ నైపుణ్యాన్ని పెంపొందించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంది. లక్షమందికి ఏఐపై శిక్షణ ఇవ్వడానికి ఒక సంస్థతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోబోతోందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.