Counselling for B Pharmacy, Pharma D: బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులకు కౌన్సెలింగ్
Counselling for B Pharmacy, Pharma D: బీ ఫార్మసీ, ఫార్మా-డీ కోర్సులకు కౌన్సెలింగ్
తొలిదశ కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్ పేమెంట్, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ల పరిశీలన కోసం అక్టోబర్ 19 నుంచి 22వ తేదీ మధ్య ఆన్‌లైన్‌లో ఫైల్ చేయాలని, సర్టిఫికెట్ల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకున్న వారు అక్టోబర్ 21-23 వరకు, సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత ఆప్షన్స్ ఇచ్చుకోవాలి.
అక్టోబర్ 28న సీట్లు కేటాయిస్తారు. అక్టోబర్ 28 నుంచి 30 వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్‌సైట్ ద్వారా చేయాలి.ఆఖరి దశకు సంబంధించి నవంబర్ 4న ఆన్‌లైన్‌లో నమోదు చేసి, ఐదో తేదీన సర్టిఫికెట్ల తనిఖీ, ఆప్షన్స్‌ను ఐదు, ఆరు తేదీల్లో చేసుకోవచ్చు.
6వ తేదీన ఆప్షన్స్‌ను ఫ్రీజ్ చేస్తారు. సీట్ల కేటాయింపు 9వ తేదీన ఉంటుంది. 9 నుంచి 11 వ తేదీ వరకు ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. ఇంకా సీట్లు మిగిలితే నవంబర్ 12న స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తారు. కాగా అక్టోబర్ 8 నుంచి https://tgeapcetb.nic.in వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుందన్నారు
Comments
Post a Comment