CRPF Recruitment: పదో తరగతి అర్హతతో సీఆర్‌పీఎఫ్ ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు.. త్వరగా అప్లై చేసుకోండి..!
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. కేంద్ర భద్రతా దళాల్లో భారీ సంఖ్యలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(CRPF)లో కొలువు సాధించే అవకాశం వచ్చింది.
ఖాళీల వివరాలు
సీఆర్‌పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్/మోటార్ మెకానిక్ (కాంబాటైజ్డ్) రిక్రూట్ మెంట్‌లో భాగంగా మొత్తం 124 ఖాళీలను భర్తీ చేస్తుంది.
వయోపరిమితి
దరఖాస్తుదారుల గరిష్ట వయసు 56 ఏళ్లకు మించకూడదు.
ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్
అభ్యర్థులు పదో తరగతి పాసై ఉండాలి. అదేవిధంగా మెకానిక్ మోటర్ వెహికల్‌లో ఐటీఐ సర్టిఫికేట్ లేదా మూడేళ్ల అప్రెంటిస్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.
సెలక్షన్ ప్రాసెస్
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో ఉంటుంది. ముందు డాక్యుమెంట్ వెరిఫికేషన్, రెండో దశలో ఇంటిగ్రిటీ అండ్ విజిలెన్స్ క్లియరెన్స్, తర్వాత ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్, క్లియరెన్స్ సర్టిఫికేషన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
జీతభత్యాలు
ఎంపికయ్యే అభ్యర్థులకు జీతం నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 మధ్య ఉంటుంది.
అప్లికేషన్ ప్రాసెస్
- దరఖాస్తుదారులు ముందుగా సీఆర్‌పీఎఫ్ అధికారిక పోర్టల్ https://rect.crpf.gov.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలోకి వెళ్లి, సీఆర్‌పీఎఫ్ సబ్-ఇన్‌స్పెక్టర్/మోటార్ మెకానిక్ (కాంబాటైజ్డ్) రిక్రూట్‌మెంట్-2024 అనే లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి.
- ఆ తరువాత అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- పర్సనల్, ఎడ్యుకేషన్ వివరాలతో అప్లికేషన్‌ను ఫిలప్ చేయాలి.
- అవసరమైన డాక్యుమెంట్స్ అప్లికేషన్‌కు జత చేయాలి. గత ఐదేళ్ల అప్రెంటిస్‌షిప్ కాపీ, ఇంటిగ్రిటి అండ్ విజిలెన్స్ క్లియరెన్స్ సర్టిఫికేట్స్ వంటివి తప్పనిసరిగా అటాచ్ చేయాలి.
- అప్లికేషన్‌ను పోస్ట్ ద్వారా ఐడీజీ (Estt), డైరెక్టరేట్ జనరల్, సీఆర్ పీఎఫ్, బ్లాక్ నం-1, సీజీఓ కాంప్లెక్స్, లోథి రోడ్, న్యూఢిల్లీ-110003 అనే అడ్రస్‌కు పంపాలి.
అప్లికేషన్ ఫారమ్ నోటిఫికేషన్ వెలువడిన 60 రోజుల్లో పేర్కొన్న అడ్రస్‌కు పంపాలి. నిర్ణీత సమయం దాటిన తరువాత వచ్చే అప్లికేషన్స్‌ను పరిగణనలోకి తీసుకోరు. CRPF యాక్ట్-1949, రూల్స్-1955 ద్వారా ఈ రిక్రూట్‌మెంట్ జరగనుంది. ఎంపికయ్యే అభ్యర్థులకు అవసరమైన విధంగా శారీరక, వృత్తిపరమైన ట్రైనింగ్ ఉంటుంది.
మరో నోటిఫికేషన్
సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో మెడికల్ ఆఫీసర్స్ (MO) రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చింది. సూపర్ స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (సెకండ్ ఇన్ కమాండ్) 5 ఖాళీలు, స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్ (డిప్యూటీ కమాండెంట్) 176, మెడికల్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ కమాండెంట్) 164 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన మెడికల్ అభ్యర్థులు ITBP అధికారిక పోర్టల్ recruitment.itbpolice.nic.in విజిట్ చేసి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 16న ప్రారంభం కాగా, ఈ గడువు నవంబర్ 14న ముగుస్తుంది.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment