కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైతే ఏటా రూ. 29 లక్షల భారీ జీతం లభిస్తుంది
కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైతే ఏటా రూ. 29 లక్షల భారీ జీతం లభిస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ www.nhai.com వెబ్‌సైట్ విజిట్ చేయాలని కోరింది.
పోస్టులు - ఖాళీలు
ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం 2 పోస్టులను భర్తీ చేయనుంది. 1 టెక్నికల్ హెడ్, 1 టోల్ ఆపరేషన్ హెడ్ పోస్టును భర్తీ చేయనుంది.
అర్హత ప్రమాణాలు
హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ) లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) పూర్తి చేసి ఉండాలి. M/oRTH/IRC నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు ప్రభుత్వ రంగ, పీఎస్‌యూ, స్వయం ప్రతిపత్త సంస్థలు లేదా రోడ్డు విస్తరణ పనులు చేపట్టే ప్రైవేట్ సంస్థల్లో కనీసం 20 సంవత్సరాల పని చేసి ఉండాలి. పని అనుభవం ఉన్న వారి దరఖాస్తులను మాత్రమే రిక్రూట్‌మెంట్‌కు పరిగణలోకి తీసుకుంటారు. ఫ్రెషర్స్ దరఖాస్తులను పరిగణించరు.
వయో పరిమితి
అభ్యర్థుల వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు. అయితే, పదవీ విరమణ చేసిన లేదా పదవీ విరమణ పొందిన ప్రభుత్వ అధికారులకు వయో సడలింపు ఉంటుంది. వీరి వయస్సు 63 సంవత్సరాలు మించకూడదు.
కాంట్రాక్ట్ వ్యవధి
ఈ ఉద్యోగాలను ఎన్‌హెచ్‌ఏఐ కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేస్తోంది. రెండేళ్ల పాటు కాంట్రాక్టు పీరియడ్ ఉంటుంది. కాంట్రాక్టు పూర్తయిన తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థి పనితీరు ఆధారంగా మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉంటుంది.
జీత భత్యాలు, ఇతర ప్రయోజనాలు
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే భారీ జీతం లభిస్తుంది. అభ్యర్థులు రూ. 29 లక్షల యాన్యువల్ ప్యాకేజీ అందుకుంటారు. అంటే ప్రతినెలా రూ.2,40,000 లభిస్తుంది. అధికారిక వాహనం, టీఏ/డీఏ వంటి ఇతర అలవెన్సులు మాత్రం ఉండవు.
అప్లికేషన్ పేపర్
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ www.nhai.gov.inను సందర్శించి అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం ఫారమ్‌ను నింపి, కావాల్సిన డాక్యుమెంట్లు, రెజ్యూమ్ యాడ్ చేసి నవంబర్ 5 సాయంత్రం 6 గంటలలోపు hr.nhipmpl@nhai.org ఈ-మెయిల్ అడ్రస్‌కు పంపించాలి.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అర్హత, అనుభవం ఆధారంగా ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారి దరఖాస్తులను పరిశీలించి ఉద్యోగంలోకి తీసుకుంటారు.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment