Union Bank of India Local Bank Officer Recruitment 2024 – Apply Online for 1500 Posts: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం

 

UBI LBI Recruitment: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం

UBI LBI Recruitment: యూనియన్ బ్యాంకులో 1,500 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు, ఎంపికైతే రూ.85 వేల వరకు జీతం


UBI Recruitment of Local Bank Officer: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

దీనిద్వారా మొత్తం 1500 ఖాళీలను భర్తీచేయనున్నారు. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ అక్టోబరు 24న ప్రారంభంకాగా.. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 13లోగా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.48,480-రూ.85,920 జీతంగా చెల్లిస్తారు.

వివరాలు..

➥ లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) (జేఎంజీఎస్-I స్కేల్)

ఖాళీల సంఖ్య:1,500 పోస్టులు.

పోస్టుల కేటాయింపు:ఎస్సీ-224; ఎస్టీ-109; ఓబీసీ-404; ఈడబ్ల్యూఎస్-150; యూఆర్-613.

రాష్ట్రాల వారీగా ఖాళీలు..

రాష్ట్రంపోస్టులు
ఆంధ్రప్రదేశ్200
తెలంగాణ200
అస్సాం50
గుజరాత్200
కర్ణాటక300
కేరళ100
మహారాష్ట్ర50
ఒడిశా100
తమిళనాడు200
పశ్చిమ్ బెంగాల్100
మొత్తం ఖాళీలు1500

అర్హతలు:గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో రెగ్యులర్ బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:01.10.2024 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా.

ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, అప్లికేషన్స్ స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.175 చెల్లిస్తే సరిపోతుంది.

రాతపరీక్ష విధానం..
➥ మొత్తం 200 మార్కులకు రాతపరీక్ష, 25 మార్కులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష ఉంటుంది.
➥ రాతపరీక్షలో రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్-45 ప్రశ్నలు-60 మార్కులు, జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్-40 ప్రశ్నలు-40 మార్కులు), డేటా అనాలిసిస్ & ఇంటర్ప్రెటేషన్-35 ప్రశ్నలు-60 మార్కులు, ఇంగ్లిష్ లాంగ్వేజ్-35 ప్రశ్నలు-40 మార్కులు ఉంటాయి.
➥ పరీక్ష సమయం 180 నిమిషాలు.
➥ఇక ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్లో లెటర్ రైటింగ్, ఎస్సే-2 ప్రశ్నలు-25 మార్కులు ఉంటాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు.
➥ ఇంగ్లిష్ మినహాయించి మిగతా అన్ని ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
➥ పరీక్షలో నెగెటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కల చొప్పున కోత విధిస్తారు.

ఇంటర్వ్యూ విధానం: రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపికచేస్తారు. మొత్తం 100 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులను 40 శాతంగా నిర్ణయించారు. ఇక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 35 శాతంగా నిర్ణయించారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:అమరావతి, అనంతపురం, ఏలూరు, గుంటూరు/ విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

జీతం:నెలకు రూ.48,480-రూ.85,920.

ముఖ్యమైన తేదీలు..

➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం: 24.10.2024.

➥ ఆన్లైన్ దరఖాస్తు, ఫీజు చెల్లింపునకు చివరితేదీ: 13.11.2024.

➥ దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరితేదీ: 28.11.2024.

Apply Here:

 BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610

ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:

 బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610

Union Bank of India Local Bank Officer Recruitment 2024 – Apply Online for 1500 Posts


Name of the Post: Union Bank of India Local Bank Officer Online Form 2024

Post Date: 24-10-2024

Total Vacancy: 1500

Brief Information: Union Bank of India has published a notification for the recruitment of Local Bank Officer (LBO) Vacancy for Year 2025-26. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

Union Bank of India

Local Bank Officer (LBO) Vacancy 2024


Application Fee

  • Fee for General/ EWS/OBC candidates: Rs. 850/- + GST
  • Fee for SC/ST/PwBD Candidates : Rs. 175/- + GST
  • Payment Mode : Through debit card/credit card /internet banking/MPS, Cash
    Cards/ Mobile Wallets/UPI

 Important Dates

  • Start Date for Apply Online & Payment of Fee: 24-10-2024 (00:00 Hrs)
  • Last Date for Apply Online & Payment of Fee: 13-11-2024 (24:00 Hrs)

Age Limit (as on 01-10-2024)

  • Minimum Age Limit: 20 Years
  • Maximum Age Limit: 30 Years
  • Age Relaxation is applicable as per rules.

Qualification

  • Candidates Should Possess Any Degree.
Vacancy Details
State NameTotal
Local Bank Officer (LBO) (JMGS -I) – 1500 Vacancies
Andhra Pradesh200
Assam50
Gujarat200
Karnataka300
Kerala100
Maharashtra50
Odisha100
Tamil Nadu200
Telangana200
West Bengal100
Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Apply OnlineClick Here
Detailed NotificationClick Here
Short NotificationClick Here
Official WebsiteClick Here

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)