APAAR Card : విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ కార్డు
APAAR Card : విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ కార్డు
జిల్లాలోని అన్ని జూనియర్ కళాశాల విద్యార్థుల వివరాలను అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)లో నమోదు చేయాలని ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ ఆదేశించారు.
ఇందులో విద్యార్థి డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని పేర్కొన్నారు. త్వరితగతిన విద్యార్థుల డేటాను తప్పులులేకుండా పొందుపర్చాలని సూచించారు. ప్రతి అధ్యాపకుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదుచేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు కళాశాలల అధ్యాపకులకు కూడా అవకాశం ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కామేశ్వరరావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు.
అపార్ ఐడీతో విద్యార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలోని ఏఐఎస్‌ఎఫ్ కార్యాలయంలో ఏఐఎస్‌ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశంలో నిర్వహించారు.
వాటి పరిష్కారానికి జిల్లాకు చెందిన వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే ఉన్న ఆధార్ కార్డులో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల పేర్లలో తప్పులు, స్కూల్ రికార్డుల్లో జన్మదిన తేదీల మార్పు, చిన్నపాటి అక్షర దోషాలు, గ్రామ, నగరపంచాయతీ పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలో నమోదై ఉన్న జనన ధ్రువీకరణ పత్రాల్లో విద్యార్థుల ఇంటిపేర్లు, పూర్తిపేర్లు నమోదు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు.
చిన్నచిన్న అక్షర తప్పులు తదితర సమస్యలు సరిచేసేందుకు విద్యార్థుల సంఖ్యకు తగ్గట్లు ఆధార్ నమోదు కేంద్రాలు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. బర్త్ సర్టిఫికెట్ కావాలంటే వీఆర్‌ఓలు వేలాది రూపాయలు విద్యార్థి తల్లిదండ్రుల దగ్గర వసూలు చేస్తున్నారని, దీనిపై తక్షణమే కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Comments
Post a Comment