Govt Jobs: రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షకు పైగా జీతం..!

 Govt Jobs: రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షకు పైగా జీతం..!

Govt Jobs: రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు లక్షకు పైగా జీతం..!

దేశంలోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలు వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ చేపడుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ, ఇండియాలోనే అతిపెద్ద కమర్షియల్ ఆయిల్ కంపెనీ అయిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

సంస్థ పరిధిలోని హాస్పిటల్స్‌లో మెడికల్ స్టాఫ్ పోస్టులను ఈ రిక్రూట్‌మెంట్‌తో నింపనుంది. వివరాలు చూద్దాం.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, గౌహతి రిఫైనరీ హాస్పిటల్‌లో క్యాజువాలిటీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (CDMO) పోస్టుల భర్తీకి నవంబర్ 11న నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్నవారు 2024 నవంబర్ 26 లోపు IOCL అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో IOCL కేవలం రెండు పోస్టులను మాత్రమే భర్తీ చేయనుంది.
ఐవోసీఎల్‌లో క్యాజువాలిటీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన మెడికల్ కాలేజీ లేదా యూనివర్సిటీ నుంచి MBBS పూర్తి చేసి ఉండాలి. అలాగే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (MCI) లేదా స్టేట్ మెడికల్ కౌన్సిల్‌ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. MBBS డిగ్రీతో పాటు డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ (MD/MS) అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇస్తారు.

అప్లికేషన్ సమర్పించే చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 50 సంవత్సరాల లోపు ఉండాలి. అయితే IOCL రూల్స్ ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీల అభ్యర్థులకు వయో పరిమితి సడలింపు ఉంటుంది. క్యాజువాలిటీ లేదా ఎమర్జెన్సీ డ్యూటీలలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఈ పోస్టులకు ఫ్రెషర్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలిస్తారు. అర్హత ప్రమాణాలు, అనుభవం ఆధారంగా కొందరిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. వీటికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థుల పర్ఫార్మెన్స్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2024 నవంబర్ 26న (మంగళవారం) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఇంటర్వ్యూ వెన్యూ:
డిప్యూటీ జనరల్ మేనేజర్ (HSE-మెడికల్),
గౌహతి రిఫైనరీ హాస్పిటల్,
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్,
PO- నూన్మతి, జిల్లా - కామ్రూప్ మెట్రో,
గౌహతి - 781020.

అభ్యర్థులు తమ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఒరిజినల్, ఫోటోకాపీలను తప్పనిసరిగా తీసుకురావాలి. ఎక్స్‌పీరియన్స్ లెటర్స్, ఇతర డాక్యుమెంట్స్ కూడా సబ్‌మిట్ చేయాలి. రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌కు సంబంధించి ఏవైనా అప్‌డేట్స్, ఇతర సూచనల కోసం అభ్యర్థులు IOCL అధికారిక వెబ్‌సైట్‌ విజిట్ చేయడం మంచిది. క్యాజువాలిటీ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంపికైన వారికి క్వాలిఫికేషన్ ఆధారంగా జీతం ఇస్తారు. MBBS, ఇంటర్న్‌షిప్ చేసిన వారిని ఉద్యోగానికి తీసుకుంటే నెలకు రూ. 1,05,200 జీతం ఇస్తారు. MBBS విత్ డిప్లొమా (మెడికల్ స్పెషాలిటీ) క్వాలిఫికేషన్ ఉన్నవారికి నెలకు రూ. 1,14,100; MBBSతో పాటు MD/MS (పోస్ట్ గ్రాడ్యుయేట్) చదివిన వారికి నెలకు రూ. 1,22,900 జీతం ఇస్తారు

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)