TG TET 2025 Notification: టెట్ నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
TG TET 2025 Notification: టెట్ నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తు, పరీక్ష తేదీలు ఇవే..
తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి నవంబర్ 4న ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
జాబ్ క్యాలెండర్‌లో ఏడాదికి రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఏడాది మే 20 నుంచి జూన్ 2 వరకూ టెట్ నిర్వహించారు. ఈ పరీక్షలకు 2.35 లక్షల మంది హాజరయ్యారు.
వీరిలో 1.09 లక్షల మంది అర్హత సాధించారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ నేపథ్యంలోనూ బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన వారికి టెట్ రాసే అవకాశం కల్పించారు.
తాజా టెట్‌కు సంబంధించిన విధివిధానాలు, సిలబస్‌తో కూడిన సమాచార బులిటెన్ నవంబర్ 5న https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఇటీవలే 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయడం, టెట్ నిర్వహించడంతో.. జనవరిలో నిర్వహించే టెట్‌కు ఎక్కువ మంది దరఖాస్తు చేసుకోకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. టెట్‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితకాలం పాటు చెల్లుబాటు అవుతుంది.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016 నుంచి టెట్ నిర్వహిస్తున్నారు. డీఈడీ అర్హత గల వారు పేపర్-1, బీఈడీ అర్హులు పేపర్-2తో పాటు పేపర్-1 రాసేందుకు కూడా అవకాశం కల్పించారు. పేపర్-1 ఉత్తీర్ణులు ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే అర్హత సాధిస్తారు.
పేపర్-2 అర్హులు ఉన్నత పాఠశాలల వరకూ బోధించే వీలుంది. అయితే పేపర్-2లో ఉత్తీర్ణులు గత 8 ఏళ్ళుగా తక్కువగా ఉంటున్నారు. గరిష్టంగా 30 శాతం దాటకపోవడం, జనరల్ కేటగిరీలో ఉత్తీర్ణత శాతం మరీ తక్కువగా ఉండటం కని్పస్తోంది. ఇందుకు బీఈడీలో నాణ్యత లోపమే కారణమనే విమర్శలున్నాయి.
Apply Here:
BK Technologies, H no: 3-52/7/A, Mother Theresa School Opposite, Vidyanagar, Choutuppal, Ph: 9491830610
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి:
బీకే టెక్నాలజీస్, ఇంటి నెం: 3-52/7/ఏ, మదర్ థెరిస్సా స్కూల్ ఎదురుగా, విద్యానగర్, చౌటుప్పల్, Ph: 9491830610
Comments
Post a Comment