LIC: విద్యార్థులకు ఎల్‌ఐసీ స్కాలర్‌షిప్.. 10th క్లాస్, ఇంటర్, డిప్లొమా పూర్తి చేసుకున్న వాళ్లు అప్లయ్ చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే
Life Insurance Corporation of India : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నత చదువులు చదువుకోవాలనుకునే విద్యార్థుల కోసం స్కాలర్‌షిప్ తీసుకొచ్చింది. పూర్తి వివరాల్లోకెళ్తే..
ప్రధానాంశాలు:
- ఎల్‌ఐసీ గోల్డన్‌జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్ 2024
- టెన్త్, ఇంటర్, డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు
- డిసెంబర్ 22 దరఖాస్తులకు చివరితేదిగా నిర్ణయం

ఉండాల్సిన అర్హతలివే:
2021-22, 2022-23, 2023 -24 అకడమిక్ ఇయర్‌లో 10వ తరగతి - 10th Class / ఇంటర్మీడియట్ - Intermediate/ డిప్లొమా లేదా తత్సమాన విద్యను పూర్తి చేసుకున్న వాళ్లు ఈస్కాలర్ షిష్‌నకు అప్లయ్ చేసుకోవచ్చు. వీళ్లు గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. విద్యార్థులు పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి https://www.licindia.in/ వెబ్‌సైట్ చూడొచ్చు. విద్యార్థులు డిసెంబర్ 8 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 22 దరఖాస్తులకు చివరితేది.LIC Scholarship Scheme ప్రకటన

Apply Here:
LIC గోల్డెన్ జూబిలీ స్కాలర్షిప్ స్కీం 2024 కోసం విద్యార్థుల ఎంపిక ఇలా!
విద్యార్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ విధానంలోనే పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించిన తర్వాత, అభ్యర్థి ఆన్‌లైన్ అప్లికేషన్‌లో అతను అందించిన ఈమెయిల్ ఐడీ ద్వారా ఒక రసీదుని పొందుతారు. ఆ రసీదు మెయిల్‌లో పేర్కొనబడిన ఎల్ఐసీ (LIC) డివిజనల్ కార్యాలయం ద్వారా తదుపరి ఉత్తరప్రత్యుత్తరాలు జరుగుతాయి. అభ్యర్థి తన సరైన ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను కమ్యూనికేషన్ కోసం అందించాల్సి ఉంటుంది.విద్యార్థుల దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హులైన విద్యార్థులను గుర్తించి.. ఎంపిక చేస్తారు. అనంతరం.. వారికి సమాచారమిస్తారు. వారి నుంచి బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తారు. వాటిలో బ్యాంక్ పేరు, అకౌంట్ నంబర్, బ్రాంచ్ పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్ (IFSC Code), క్యాన్సిల్డ్ చెక్ లీఫ్ మొదలైనవి ఉంటాయి. అనంతరం వారి బ్యాంక్ ఖాతాలో స్కాలర్ షిప్ మొత్తాన్ని జమ చేస్తారు. విలీనమైన బ్యాంకుల విషయంలో బ్యాంకు యొక్క కొత్త IFSC కోడ్‌ను పేర్కొనాలి. ఆ బ్యాంక్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలి. బ్యాంక్ ఖాతా కింద అనుమతించబడిన గరిష్ట బ్యాలెన్స్‌ను కూడా చెక్ చేసుకోవాలి.
ఈ పథకంలో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తామని ఎల్‌ఐసీ 'ఎక్స్' వేదికగా ప్రకటించింది. దరఖాస్తుల అర్హతలు, గడువు తేదీల వివరాలను తమ అధికారిక ప్రకటనలో వెల్లడించింది.
అర్హతలు:
2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమో లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి.
గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో కనీసం 60 శాతం మార్కులు లేదా సీజీపీఏ సాధించి ఉండాలి.
2024-25లో ఉన్నత విద్య (మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమో, వొకేషన్ కోర్సులు, ఐటీఐ) చదవడానికి ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేయవచ్చు.
ప్రత్యేక పథకం విద్యార్థినులకు:
ప్రత్యేక "గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ స్కీమ్" కింద దరఖాస్తు చేసే విద్యార్థినులకు రెండేళ్ల పాటు ఉపకారవేతనం అందుతుంది.
పది తరగతి పూర్తిచేసిన తర్వాత ఇంటర్మీడియట్, 10+2 లేదా ఏదైనా డిప్లొమో కోర్సు చదవడానికి అర్హులై ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ:
ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ www.licindia.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు గడువు డిసెంబర్ 22, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ 8, 2024 నుంచి ప్రారంభం అవుతుంది.
గమనిక:
కుటుంబ వార్షిక ఆదాయం, స్కాలర్‌షిప్ మంజూరు మొత్తానికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎల్‌ఐసీ వెబ్‌సైట్‌ను సందర్శించి వివరాలు తెలుసుకోవచ్చు.
Comments
Post a Comment