1215 Posts at Indian Postal Circle : 1215 ఖాళీలు.. ఇండియన్ పోస్టల్ నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు..
1215 Posts at Indian Postal Circle : 1215 ఖాళీలు.. ఇండియన్ పోస్టల్ నోటిఫికేషన్ విడుదల.. టెన్త్ పాసైతే చాలు..

ఇండియన్ పోస్టల్ సర్కిల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. నిరుద్యోగులు, అర్హత, ఆసక్తి ఉన్నవారు ప్రకటించిన వివరాలను పరిశీలించుకుని, ఆయా తేదీల్లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
ఇండియన్ పోస్టల్ సర్కిల్లో, 2025 సంవత్సరానికి 21,413 గ్రామీణ డాక్ సేవక్ (GDS) ఉద్యోగాలకు నోటిపికేషన్ జారీ చేసింది. ఇక, ఆంధ్రప్రదేశ్‌లో సర్కిల్‌లో 1215 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ భారతదేశం అంతటా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టల్ సేవలను మెరుగుపరచడం లక్ష్యంగా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ (ఏబీపీఎం), గ్రామీణ డాక్ సేవక్ వంటి పదవులకు అవకాశాలను అందిస్తుంది.
ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు రాత పరీక్ష లేకుండానే ఎంపిక అవుతారు. వారి నైపుణ్యాలు, విద్యార్హతలు, పని అనుభవం వంటివి పరిగణలోకి తీసుకుని ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు.
Circle Name | Andhra Pradesh |
Language Name | Telugu |
UR | 553 |
OBC | 239 |
SC | 157 |
ST | 63 |
EWS | 159 |
PWD-A | 7 |
PWD-B | 14 |
PWD-C | 22 |
PWD-DE | 1 |
Total | 1215 |
విద్యార్హతలు- పదో తరగతి పాసై ఉండాలి. ఇందులో, మ్యాథ్స్ ఇంగ్లీష్ సబ్జెక్టులకు తొలి ప్రాధాన్యం, లేదా సెలెక్టివ్ సబ్జెక్టులుగా పూర్తి చేసి ఉండాలి.
నైపుణ్యాలు- కంప్యూటర్ పరిజ్ఞానం, సైక్లింగ్ పరిజ్ఞానం, జీవనోపాధికి తగిన మార్గాలు తెలిసి ఉండాలి.
బ్రాంచ్ పోస్ట్ మాస్టర్: రూ. 12,000/- to రూ. 29,380/-
దక్ సేవక్స్ & ఏబీపీఎం: రూ. 10,000/- to రూ. 24,470/-
ఫీజు- జనరల్ అభ్యర్థులకు రూ. 100, మహిళలు, ఎస్సీ, ఎస్‌టీ, పీడబ్ల్యూడీ, ట్రాన్స్‌వుమెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
విధానం- ఆన్‌లైన్‌లో చేయాలి.. డెబిట్, క్రెడిట్ కార్డులతో లేదా, నెట్ బ్యాంకింగ్, యూపీఐతో దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. చెల్లింపు చేయడానికి రిజిస్ట్రేషన్ నంబర్ గమనించండి.
ముఖ్యగమనిక- ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకుని, ఫీజు చెల్లించేవారు ఈ విషయాన్ని గమనించాలి..
ఒకసారి ఫీజు చెల్లించిన తరువాత, ఈ ఫీజు మరోసారి వెనక్కి తీసుకోలేరు. అందుచేత, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం చేసే ముందే ప్రతీ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి.
ఫీజు మినహాయింపు ఉన్న అభ్యర్థులు డైరెక్ట్‌గా మీ దరఖాస్తులును కొనసాగించవచ్చు.
విభాగం | ఖాళీలు |
1. అమలాపురం | 28 |
2. అనకాపల్లి | 51 |
3. అనంతపూర్ | 66 |
4. భీమవరం | 41 |
5. చిత్తూర్ | 51 |
6. ఏలూరు | 38 |
7. కడప | 40 |
8. గుడివాడ | 40 |
9. గూడూర్ | 40 |
10. గుంటూర్ | 21 |
11. హిందుపూర్ | 50 |
12. కాకినాడ | 42 |
13. కర్నూల్ | 55 |
14. మచిలీపట‍్నం | 27 |
15. మార్కాపూర్ | 57 |
16. నంద్యాల్ | 37 |
17. నర్సారావు పేట్ | 34 |
18. నెల్లూర్ | 63 |
19. పార్వతీపురం | 39 |
20. ప్రకాశం | 61 |
21. ప్రొద్దుటూర్ | 32 |
22. రాజమండ్రి | 38 |
23. ఆర్ఎంఎస్ ఏజీ | 3 |
24. ఆర్‌ఎంఎస్ వై | 8 |
25. శ్రీకాకుళం | 34 |
26. తాడెపల్లిగూడెం | 31 |
27. తెనాలి | 34 |
28. తిరుపతి | 59 |
29. విజయవాడ | 48 |
30. విశాఖపట్నం | 9 |
31. విజయనగరం | 26 |
విద్యార్హతలను బట్టి ఉంటుంది. ఈ ఎంపిక విధానంలో పరీక్ష ఉండదు. అభ్యర్థి విద్యా, నైపుణ్యం, అనుభవం వంటి వివరాలను అనుగుణంగా ఎంపిక చేస్తారు.
40 సంవత్సరాలు.
దరఖాస్తుల విధానం: https://indiapostgdsonline.gov.in. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి.
దరఖాస్తుల ప్రారంభం తేదీ- ఫిబ్రవరి 10, 2025
దరఖాస్తుల చివరి తేదీ- మార్చి 3, 2025
కరెక్షన్ విండో- మార్చి 6, 2025 నుంచి మార్చి 8, 2025 వరకు
1. మొదట, జీడీఎస్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. అక్కడ, మీ రెజిస్టర్ చేసుకుని, రెజిస్టర్ నంబర్ పొందండి.
2. మీ ఈ మెయిల్, ఫోన్‌ను ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండేలా చూసుకోండి. యాక్టివ్‌గా ఉండే ఈమెయిల్, ఫోన్ నంబర్‌నే నమోదు చేయండి. ఉద్యోగానికి సంబంధించిన ప్రతీ వివరాలను మీ ఈ మెయిల్, లేదా ఫోన్ నంబర్‌కే వస్తాయి.
3. ఒకే ఈ మెయిల్, లేదా మొబైల్ నంబర్‌ను పదే పదే రిజిస్టర్ చేయడానికి ఉపయోగించరాదు. నకిలీ రిజిస్ట్రేషన్‌లు అనర్హులుగా ప్రకటించబడతాయి.
4. ఒకవేళ, మీరు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను మర్చిపోతే, కంగారు పడకండి.. అక్కడ కనిపించే ఫర్గెట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్‌ను వినియోగించండి.
Comments
Post a Comment