India Post GDS Recruitment Notification 2025: ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
తెలంగాణ పోస్టాఫీసుల్లో 519 ఉద్యోగాలు.. 10వ తరగతి పాసైతే చాలు.. రాతపరీక్ష లేదు

India Post GDS Recruitment Notification 2025 : టెన్త్ క్లాస్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకోవాలనుకునే వారికి భారత తపాలా శాఖ (ఇండియా పోస్ట్) గుడ్‌న్యూస్ చెప్పింది. వివరాల్లోకెళ్తే..
హైలైట్:
- ఇండియా పోస్ట్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ 2025
- దేశవ్యాప్తంగా 21,413 ఖాళీల భర్తీకి ప్రకటన
- తెలంగాణ సర్కిల్ పరిధిలో 519 పోస్టుల భర్తీ
- 10వ తరగతి ఉత్తీర్ణత ఉన్నవాళ్లు అర్హులు
ఇతర ముఖ్యమైన సమాచారం:
- విద్యార్హతలు: 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణకు చెందిన వారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవడం తప్పనిసరి. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సైకిల్ తొక్కటం వచ్చి ఉండాలి.
- వయసు: 18- 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
- జీత భత్యాలు: నెలకు బీపీఎం పోస్టులకు రూ.12,000 - రూ.29,380.. ఏబీపీఎం/ డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 - రూ.24,470 వేతనం ఉంటుంది.
- దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌ఉమెన్‌లకు ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులు రూ.100 చెల్లించాలి.
- దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ఏదైనా ఒక పోస్టల్ సర్కిల్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఒక అభ్యర్థి ఒకటి కన్నా ఎక్కువ పోస్టల్ సర్కిల్‌లకు దరఖాస్తులు సమర్పిస్తే అన్ని దరఖాస్తులు రద్దు చేయబడతాయనే విషయాన్ని గమనించాలి.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభ తేది: ఫిబ్రవరి 10, 2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 3, 2025
- దరఖాస్తు సవరణలకు అవకాశం: మార్చి 6 నుంచి 8 వరకు.
Comments
Post a Comment