TG EAPCET (EAMCET) – 2025
రాష్ట్ర విభజన సమయంలో విద్యా సంస్థల్లో పదేళ్ల పాటు 15శాతం నాన్-లోకల్ కోటాను అమలు చేస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు విడుదల చేశారు.ఈ 15 శాతం కోటాలో ఏపీతో పాటు తెలంగాణ స్థానికులూ పోటీ పడుతున్నారు.
రాష్ట్ర విభజన జరిగి 2024తో పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో... ఈ 15శాతం కోటా గడువు ముగిసిపోయింది. ఈ లెక్కన గత విద్యా సంవత్సరంలోనే 15% కోటా రద్దు అమల్లోకి రావాల్సి ఉంది. కానీ అప్పటికే వివిధ ప్రవేశపరీక్షల ప్రకటనలు విడుదలవడంతో నాన్-లోకల్ కోటాను అమలు చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతమున్న అన్ని యూనివర్సిటీలు కూడా ఇదే స్థానికత కిందకు వస్తాయి. 85శాతం సీట్లు స్థానికులకు, 15శాతం సీట్లు ఇతర రాష్ట్రాలు, తెలంగాణ విద్యార్థులకు కలిపి దక్కుతాయి. ఇప్పుడు ఈ 15శాతం సీట్లకు కూడా తెలంగాణ స్థానికత వర్తించేలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయితే రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణకు సంబంధించి ఇంతవరకు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఎలాంటి అధికారిక ఆమోదం లభించలేదు.
రాష్ట్ర విభజన చట్టంలోని అంశాల మేరకే తాజాగా జీవో ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కానీ రాష్ట్రపతి ఆమోదం లేకుండా జీవో ఇవ్వడం సరికాదని.. దీనివల్ల న్యాయపరమైన సమస్యలు ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు.
- అధికారిక వెబ్‌సైట్ eapcet.tgche.ac.in ను సందర్శించండి
- హోమ్‌పేజీపై Direct Registration Link పై క్లిక్ చేయండి.
- మీ మొభైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వంటి వ్యక్తిగత వివరాలను నింపండి.
- మీ అడ్రస్, ఎగ్జామ్ సెంటర్ ప్రాధాన్యత, రిజర్వేషన్ వివరాలు ఎంటర్ చేయండి.
- అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి
- అన్ని వివరాలు పరిశీలించి, ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
ఫిబ్రవరి 20, 2025
మార్చి 1, 2025
ఏప్రిల్ 04, 2025 వరకు (ఆలస్య రుసుము లేకుండా)
ఏప్రిల్ 06 నుంచి 08 వరకు
రూ.250 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 9 వరకు
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 14 వరకు
రూ.2,500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 18 వరకు
రూ.5000 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది : ఏప్రిల్ 24 వరకు
ఏప్రిల్ 19, 2025
29.04.2025, 30.04.2025 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ పరీక్షలు.
02.05.2025 నుంచి 05.05.2025 వరకు ఇంజనీరింగ్ పరీక్షలు.
ఉదయం సెషన్ (FN) - 09.00 AM నుండి 12.00 Noon
మధ్యాహ్నం సెషన్ (AN) - 03.00 PM నుండి 06.00 PM
https://eapcet.tsche.ac.in
.
Comments
Post a Comment