TG ICET 2025: తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ మార్చి 6న వెలువడనుంది. అభ్యర్థులు మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

 Telangana ICET  2025 Released: తెలంగాణ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల.. .. మార్చి 10 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ మార్చి 6న వెలువడనుంది. అభ్యర్థులు మార్చి 10 నుంచి మే 3 వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.550; బీసీ, జనరల్‌ అభ్యర్థులు రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆలస్య రుసుము లేకుండా మే 3 వరకు దరఖాస్తులు సమర్పించే అవకాశం కల్పించారు. జూన్‌ 8, 9 తేదీల్లో ఐసెట్‌ పరీక్షలను నిర్వహిస్తామని ఐసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఏ రవి తెలిపారు.జులై 7న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు.

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీసీఏ, బీఎస్సీ-కంప్యూటర్స్, బీకామ్, బీఏ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (బీఏ/ బీఎస్సీ/ బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీసీఏ/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ). ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. అయితే ఇంటర్ స్థాయిలో కచ్చితంగా మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.

వయోపరిమితి: ఐసెట్-2025 నోటిఫికేషన్ సమయానికి (06.03.2024) 19 సంవత్సరాలు నిండి ఉండాలి. ఎలాంటి గరిష్ఠ వయసు లేదు.

మొత్తం 200 మార్కులకు ఐసెట్ ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 150 నిమిషాలు. పరీక్షలో మూడు సెక్షన్లు (సెక్షన్-ఎ, బి, సి) ఉంటాయి. వీటిలో సెక్షన్-ఎ: అనలిటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-బి: మ్యాథమెటికల్ ఎబిలిటీ-75 ప్రశ్నలు-75 మార్కులు, సెక్షన్-సి: కమ్యూనికేషన్ ఎబిలిటీ-50 ప్రశ్నలు-50 మార్కులు ఉంటాయి.

➥ టీఎస్ ఐసెట్‌-2025 నోటిఫికేషన్‌: 06.03.2025.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10/03/2025

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03/05/2025

➥ రాతపరీక్ష తేదీలు:

BK Technologies, H No 7-3-C-97, 

Near Lord Sri Venkateshwara Swami 

TemplePanagal, Nalgonda Dist, 

Pincode 508001, Telangana

Comments

Popular posts from this blog

RRB: NTPC (Graduate) డిగ్రీ అర్హతతో రైల్వేలో 8113 ఉద్యోగాలు. దరఖాస్తు చివరితేది: అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 13లోగా దరఖాస్తు చేసుకోవాలి.

RRB Notification 2024: NTPC (Undergraduate) Vacancy 2024, ఇంటర్ అర్హతతో రైల్వే ఉద్యోగాలు, 3445 ఎన్టీపీసీ (NTPC) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ప్రారంభం, ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.10.2024 (23:59 hrs)

RRB: 14298 Technician Jobs in RRB: 10వ తరగతి అర్హతతో రైల్వే శాఖలో 14298 టెక్నీషియన్‌ ఉద్యోగాలు, Technician Grade III, Technician Grade I Signal, అక్టోబర్‌ 16వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు.