HSRP: 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టరర్ అయిన వాహనాలన్నింటికీ ఈ HSRP బిగించాల్సిందే. ఇలా మార్చుకునేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం ఇచ్చింది.
HSRP: తెలంగాణలోని అన్ని వాహనాలకు ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఫిట్ చేయాల్సిందే. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టరర్ అయిన వాహనాలన్నింటికీ ఈ HSRP బిగించాల్సిందే. ఇలా మార్చుకునేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం ఇచ్చింది.
Why Telangana Implemented HSRP?: తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్డుపైకి వచ్చే వాహనాలకు హైసెక్యూరిటీ నెంబర్ ప్లేటు కచ్చితంగా ఉండాలని ఆదేశించింది.
సెప్టెంబర్ 30 లోపు అందరూ హెచ్ఎస్ఆర్పీకి మారాలని లేకుంటే కేసులు బుక్ అవుతాయని చెప్పింది. బుధవారం జారీ చేసిన ఆదేశాల మేరకు తెలంగాణలోని అన్ని వాహనాలకు ఈ హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్లు ఫిట్ చేయాల్సిందే. 2019 ఏప్రిల్ 1 కంటే ముందు రిజిస్టరర్ అయిన వాహనాలన్నింటికీ ఈ HSRP బిగించాల్సిందే. ఇలా మార్చుకునేందుకు గడువును సెప్టెంబర్ 30 వరకు ప్రభుత్వం ఇచ్చింది. ఆ తర్వాత అలాంటి నెంబర్ ప్లేట్లు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తారు.
ఈ నెంబర్ ప్లేట్ల కోసం రవాణా శాఖ సూచించిన ఈ వెబ్సైట్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడే రిజిస్టర్ చేసుకోవాలి. వాళ్లు చెప్పిన డేట్కు వెళ్లి నెంబర్ ప్లేట్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్చుకోకుంటే కేసులు బుక్ చేస్తామని రవాణా శాఖ హెచ్చరించింది. లేకుంటే బండి సీజ్ చేయడమైనా జరుగుతుందని వార్నింగ్ ఇచ్చింది. HSRP లేని వాహనాలకు బీమా, పొల్యూషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వబోరని తేల్చి చెప్పింది.
హెచ్ఎస్ఆర్పీ అంటే? ఇప్పుడున్న నెంబర్ ప్లేట్కు దానికి తేడా ఏంటీ?
హెచ్ఎస్ఆర్పీ అంటే హై సెక్యూరిటీ రిజిస్ట్రేష్ ప్లేట్. ఇది భారత దేశంలోని వాహనాల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన లైసెన్స్ ప్లేట్. దీనిని అల్యూమినియం, రిట్రో రిఫ్లెక్టివ్ షీట్లతో తయారు చేస్తారు. ఈ నెంబర్ ప్లేట్లు వాహన భద్రతను మరింత పెంచుతాయని ప్రభుత్వం చెబుతోంది. నకిలీ ప్లేట్ను నిరోధించడానికి, వాహన సంబంధిత నేరాలను అరికట్టడానికి ఉపయోగపడతుందని అంటున్నారు. భారత ప్రభుత్వం, ముఖ్యంగా రోడ్డు రవాణా తప్పనిసరి చేసింది. 2019 కి ముందు నమోదు అయిన వాహనారు కూడా ఈ ప్లేట్లను అమర్చుకోవాలని ఆదేశించింది. ఈ గడువును కేంద్రం పెంచుతూ వచ్చింది. దీనిపై రాష్ట్రాలకు స్వేచ్చను ఇచ్చింది. వారికి నచ్చిన సమయంలో అమలు చేయాలని సూచించింది.
ఇప్పుడున్న ప్లేట్లతో పోల్చుకుంటే ఈ హెచ్ఎస్ార్పీ ప్లేట్లు చాలా భిన్నంగా ఉంటాయి. ఇవి ఎలక్ట్రానిక్గా వాహనంతో లిక్ అయ్యి ఉంటాయి. ఈ వివరాలు ఆటోమెటిక్గా ప్రభుత్వం వద్ద ఉన్న డేటా బేస్లో స్టోర్ అవుతుంది. దీనికి ప్రత్యేకమైన సెక్యూరిటీ సిస్టమ్ ఉంటుంది.
అల్యూమినియంతో తయారు చేసిన ఈ ప్లేట్లకు రిట్రో రిఫ్లెక్టివ్ షీట్తో లాటమినెట్ చేసి ఉంటుంది. అందుకే రాత్రివేళల్లో కూడా మెరుస్తూ ఉంటాయి. వాహనం గుర్తించడం చాలా సులభమవుతుంది.
ఈ ప్లేట్లకు అశోక చక్ర హోలోగ్రామ్ ఉంటుంది. ప్లేట్ పైన ఎడమవైపు 20mm X 20mm కొలతలతో ఈ హోలోగ్రామ్ ఉంటుంది. ఇది క్రోమియంతో తయారు చేస్తారు. దీనికి నకిలీ తయారు చేయడం చాలా కష్టం. తయారు చేసినా ఈజీగా గుర్తించవచ్చు.
ఈ ప్లేట్కు కింది భాగంలో ఎడమవైపు పది అంకెల శాశ్వత గుర్తింపు పిన్ ఉంటుంది. దీన్నిలేజర్ టెక్నాలజీతో చెక్కి ఉంటుంది.
రెండు నాన్ రీయూజబుల్ స్నాప్ లాక్లతో వాహనానికి ఫిట్ చేస్తారు. ఇవి తొలగించడం మార్చడం అంత ఈజీ కాదు.
మీరు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనం అయితే అందుకు తగ్గ కలర్ కోడెడ్ స్టికర్ ను వాహనం విండ్ స్క్రీన్పై అతికిస్తారు. పెట్రోల్, సీఎన్జీ వాహనానికి నీలం, డీజిల్ వాహనానికి ఆరెంజ్, ఎలక్ట్రిక్ వాహనానికి ఆకుపచ్చ స్టికర్ ఇస్తారు.
Comments
Post a Comment