Telangana TET 2025: దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2025 చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
టెట్ పరీక్షలను జూన్ 15 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.
పూర్తి సమాచారం కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికార వెబ్‌సైట్ చూడవచ్చు.
పరీక్ష తేదీలు: జూన్ 15 నుండి 30 వరకు (ఆన్‌లైన్‌లో)
దరఖాస్తుల ప్రారంభం: ఏప్రిల్ 15, 2025
చివరి తేదీ: ఏప్రిల్ 30, 2025
హాల్ టికెట్లు డౌన్‌లోడ్: జూన్ 9, 2025
ఫలితాల విడుదల: జూలై 27, 2025
పేపర్-1 మరియు పేపర్-2, ఒక్కొక్కటి 150 మార్కులకు
పేపర్-1: 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు బోధించదలచిన అభ్యర్థుల కోసం
పేపర్-2: 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు బోధించదలచిన అభ్యర్థుల కోసం
- OC: 60%
- BC: 50%
- SC/ST/Divyang: 40%
పేపర్-1: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్
పేపర్-2: బీఈడీ / ఇతర ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు
- ఒక పేపర్‌కు: ₹750
- రెండు పేపర్లకు: ₹1,000
- టెట్ అర్హత సర్టిఫికేట్ జీవిత కాలం వర్తిస్తుంది.
- DSC నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20% వెయిటేజీ ఉంటుంది.
- అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నిరుద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ టెట్(Telangana TET) నోటిఫికేషన్ విడుదల చేసింది.
జూన్ 15 నుంచి జూన్ 30 మధ్య టెట్ పరీక్షలు నిర్వహించున్నట్టు పాఠశాల విద్యశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది. కాగా బీసీ రిజర్వేషన్ల బిల్లు సంగతి తేలాక.. రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీచర్ ఉద్యోగ అభ్యర్థులకు నిర్వహించే టెట్ పరీక్షను నిర్వహించేందుకు సిద్ధం అయింది. అయితే ఏడాదికి రెండుసార్లు టెట్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోంది.
కాగా ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఏప్రిల్ 15 నుంచి అధికారిక వెబ్సైట్ లో అందుబాటులో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా.. జూన్ 15 నుంచి ౩౦ వరకు పరీక్షలు నిర్వహించి జూలై 22న ఫలితాలు విడుదల చేయనున్నారు. ఇక ఒక పేపర్ మాత్రమే రాసే వారికి రూ. ౭౫౦, రెండు పేపర్లు రాసేవారికి రూ.1000 గా ఫీజు నిర్ణయించారు.
Comments
Post a Comment