Government of Telangana Social Welfare Residential Educational Institutions Society ( TGSWREIS ): Last Date 20 may తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు
తెలంగాణలోని 243 సోషల్ వెల్ఫేర్ గురుకుల కాలేజీల్లో 2025 - 26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు.
ఆసక్తిగల విద్యార్థులు మే 20 వరకు అప్లై చేసుకోవచ్చు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, ఒకేషనల్ కోర్సుల్లో సీట్లు ఉన్నాయి. టెన్త్ పరీక్షల్లో మెరిట్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2 లక్షలు మించకూడదు.
ఒక్కో కాలేజీల్లో 40 సీట్లు ఉండగా.. ఎస్సీలకు 30 సీట్లు, ఎస్టీలకు 2 సీట్లు, బీసీలకు 5 సీట్లు, మైనార్టీలకు ఒక సీటు, ఓసీలకు రెండు సీట్లు కేటాయిస్తారు. దివ్యాంగులకు 3 శాతం, తల్లిదండ్రులు లేని విద్యార్థులకు 3 శాతం సీట్లు కేటాయిస్తారు. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో చదువుకోని విద్యార్థులు రూ.200 దరఖాస్తు చెల్లించాల్సి ఉంటుంది. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీల్లో ఐఐటీ, నీట్ వంటి పోటీ పరీక్షలకు కోచింగ్ ఇస్తారు. https://drive.google.com/file/d/1AMSY8qvoefPgde_zNlL94ctZxvm2TM8X/view?usp=sharing వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు ఉంటాయి.
Comments
Post a Comment