Union Bank Apprentice : యూనియన్ బ్యాంక్ లో 500 అప్రెంటిస్ ఖాళీలు, నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, సెప్టెంబర్ 17వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 50, తెలంగాణలో 42 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో యూబీఐ పేర్కొంది.
U nion Bank Apprentice : యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న యూబీఐ శాఖల్లో 500 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించింది. నేటి(ఆగస్టు 28) నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యారు. సెప్టెంబర్ 17వ తేదీలోగా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 50, తెలంగాణలో 42 అప్రెంటిస్ ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్ లో యూబీఐ పేర్కొంది. అభ్యర్థులు తమ సొంత రాష్ట్రంలో ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు ముందు, అభ్యర్థులు అర్హతలను ఒకసారి పూర్తిగా పరిశీలించాలని యూబీఐ సూచించింది. అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ అప్రెంటిస్‌షిప్ పోర్టల్‌లలో https://www.apprenticeshipindia.gov.in , https://nats.education.gov.in మాత్రమే నమోదు చేసుకోవాలని తెలిపింది. దరఖాస్తు హార్డ్ కాపీ, ఇతర పత్రాలు యూబీఐ ఆఫీసుకు పంపవలసిన అవసరంలేదని పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల ప్రకారం...ఆయా రాష్ట్రాలలో SC/ST/OBC/PWD మొదలైన వారికి అప్రెంటిస్ ఎంపికలలో రిజర్వేషన్లు అమలుచేస్తారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.800, ఎస్సీ/ ఎస్టీ/ మహిళా అభ్యర్థులు రూ.600, దివ్యాంగులకు రూ.400 దరఖాస్తు...