కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైతే ఏటా రూ. 29 లక్షల భారీ జీతం లభిస్తుంది
కేంద్ర రోడ్డు, రవాణా మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఎంపికైతే ఏటా రూ. 29 లక్షల భారీ జీతం లభిస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఎన్‌హెచ్‌ఏఐ అధికారిక వెబ్‌సైట్ www.nhai.com వెబ్‌సైట్ విజిట్ చేయాలని కోరింది. పోస్టులు - ఖాళీలు ఈ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం 2 పోస్టులను భర్తీ చేయనుంది. 1 టెక్నికల్ హెడ్, 1 టోల్ ఆపరేషన్ హెడ్ పోస్టును భర్తీ చేయనుంది. అర్హత ప్రమాణాలు హెడ్ టెక్నికల్, హెడ్-టోల్ ఆపరేషన్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్ విభాగంలో బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ (బీఈ) లేదా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్) పూర్తి చేసి ఉండాలి. M/oRTH/IRC నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు ప్రభుత్వ రంగ, పీఎస్‌యూ, స్వయం ప్రతిపత్త సంస్థలు లేదా రోడ్డు విస్తరణ పనులు చేపట్టే ప్రైవేట్ సంస్థల్లో కనీసం 20 సంవత్సరాల పని చేసి ఉండాలి. పని అనుభవం ఉ...