APAAR Card : విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ కార్డు
APAAR Card : విద్యార్థులకు ఆధార్ తరహాలో అపార్ కార్డు జి ల్లాలోని అన్ని జూనియర్ కళాశాల విద్యార్థుల వివరాలను అపార్ (ఆటోమేటెడ్ పర్మినెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ)లో నమోదు చేయాలని ఆర్‌ఐఓ ఎం.ఆదినారాయణ ఆదేశించారు. స్థానిక ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతీయ విద్యావిధానంలో భాగంగా ఆధార్ తరహాలో ఉండే అపార్ కార్డు విద్యార్థులకు అందిస్తారని తెలిపారు. ఇందులో విద్యార్థి డేటా మొత్తం నిక్షిప్తమై ఉంటుందని పేర్కొన్నారు. త్వరితగతిన విద్యార్థుల డేటాను తప్పులులేకుండా పొందుపర్చాలని సూచించారు. ప్రతి అధ్యాపకుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదుచేసుకోవాలని సూచించారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు కళాశాలల అధ్యాపకులకు కూడా అవకాశం ఇచ్చారని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎం.కామేశ్వరరావు, ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు. అ పార్ ఐడీతో విద్యార్థులు తీరని కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్ అన్నారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలోని ఏఐ...